![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-7 లో ఉన్న పల్లవి ప్రశాంత్ కి బయట క్రేజ్ మాములుగా లేదు. సెలబ్రిటీలని తలదన్నేలా ఉంది అతనికి పడే ఓటింగ్. ఇది ఇలాగే కొనసాగితే శివాజీ తర్వాత అతడే అన్నట్టుగా హోరాహోరీగా సాగుతుంది. ఇప్పటికైతే అంబటి అర్జున్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వగా సెకెండ్ ఫైనలిస్ట్ ఎవరు అవుతారనే ఆసక్తి అందరిలో నెలకొంది.
ఇక శనివారం నాటి ఎపిసోడ్ లో ఒక్కో కంటెస్టెంట్ టైల్ బ్రేక్ చేస్తూ వారిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి క్లాస్ పీకాడు నాగార్జున. అయితే పల్లవి ప్రశాంత్ తో మాట్లాడిన విధానం ఇప్పుడు సరికదాని బయట పెద్ద రచ్చ జరుగుతోంది. బాల్ టాస్క్‌లో అమర్‌దీప్ మొదట ప్రశాంత్ మీదికి వెళ్లి అతనిపై ఫిజికల్ ఎటాక్ చేశాడు. ఆ తర్వాత బాల్స్ అంటించుకునే క్రమంలో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఆ ప్రయత్నంలో అమర్ మెడని చేతులతో ప్రశాంత్ పట్టుకోగ చేతిని అమర్ దీప్ కొరికేశాడు. దీంతో తన చేతిని కొరికాడంటు ప్రశాంత్ చెప్పాడు. మెడికల్ రూమ్ కి వెళ్దాం పదా అని ప్రశాంత్ అంటే.. అమర్ దీప్ సైకోలా బిహేవ్ చేసి ప్రశాంత్‌ని మెడపై చేయి వేసి నెట్టుకుంటు, లాక్కుంటా మెడికల్ రూమ్ తలుపులు తెరిపించే వరకు కూడా వదల్లేదు. వద్దన్నా, తోయొద్దన్నా అని ఎన్నిసార్లు చెప్పిన కూడా అమర్ దీప్ పదే పదే ప్రశాంత్‌పై చేయి చేసుకుని నెట్టుతూనే ఉన్నాడు. ఆ వీడియో చూపించి మరీ అమర్ దీప్‌ని తిట్టి తప్పుని ఖండించారు నాగార్జున. స్వయంగా అమర్ దీపే.. ప్రశాంత్‌ని కొరికానని, నెట్టడం, తొయ్యడం, తప్పేనని ఒప్పుకున్నాడు.
పల్లవి ప్రశాంత్ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి.. నువ్వు శివాజీకి గులామా లేక బానిసవా అంటూ ఫైర్ అయ్యాడు నాగార్జున. ఆ తర్వాత అమర్ దీప్ కొరికాడంటూ నానా రచ్చ చేశావ్? ఎందుకు? అని నాగార్జున అడుగగా.. నాకు బాగా నొప్పి అయింది సర్. రక్తం కూడా వచ్చిందని చెప్పాడు. నేను డాక్టర్ లతో మాట్లాడాను. పెద్దగా ఏం అవ్వలేదని చెప్పారని నాగార్జున అన్నాడు. అలా ప్రశాంత్‌తో నాగార్జున వాదించిన తీరు చూస్తే విచిత్రంగా అనిపించింది. అమర్ దీప్ కొరికాడు అంతే కదా? రక్తం రాలేదు కదా? పళ్లు దిగలేదు కదా? ఎంతో లోతు దిగలేదు కదా అంటు ప్రశాంత్ దే తప్పు అన్నట్టుగా మాట్లాడారు. అతనికి బాధ కలిగితేనే కదా నొప్పి అయిందని చెప్పేది. అంతగా ఏం లేనప్పుడు అతనెందుకు అలా అంటాడు. నాకు నొప్పి అయిందని ప్రశాంత్ అనగా.. నేను డాక్టర్లతో మాట్లాడాను. గాట్లు పడలేదని చెప్పారు. రక్తం రాలేదని చెప్పారు. నువ్వే చిన్నదాన్ని పెద్దదాన్ని చేస్తున్నావ్ అంటూ ప్రశాంత్ దే తప్పు అనిపించేలా వాదించాడు నాగార్జున. ఇదంతా అమర్ దీప్ పై ఉన్న నెగెటివిటి పోగొట్టడానికే చేశాడా అని జనాలకి అనిపిస్తుంది.
![]() |
![]() |